పేదల కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న నేత సీఎం జగన్ : డిప్యూటీ సీఎం బూడి

పొత్తులతో మాయగాళ్లు వస్తున్నారు.. జాగ్రత్త, అప్పుడు చేసిన మోసాలను గుర్తు చేసుకోండి : డిప్యూటీ సీఎం రాజన్న దొర

పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేసి గిరిజనులకు గుర్తింపునిచ్చారు జగన్ : ఎంపీ గొట్టేట మాధవి

ఎన్నికలప్పుడే జగన్ రాజకీయాలు, పాలనలో సంక్షేమం, అభివృద్ఘికే పెద్ద పీట : ఎంపీ బెల్లాన

హామీలిచ్చి అమలు చేయని మోసగాడు చంద్రబాబు, ఇచ్చిన ప్రతీ మాటను నెరవేర్చిన మొనగాడు జగన్ : ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి

కురుపాం ( పార్వతీపురం మన్యం జిల్లా) : గిరిజన సీమలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు కనివినీ ఎరుగని రీతిలో అఖండ ఆదరణ లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో అడుగుపెట్టిన బస్సుయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ స్వాగతించారు. కురుపాం నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనలను పరిశీలించి, లబ్ధిదారులతో నేతలు ముచ్చటించారు. అనంతరం కురుపాం పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో అర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అరకు ఎంపీ గొట్టేట మాధవి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ వాణి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కళావతి, శంబంగి చిన అప్పల నాయుడుతో పాటుగా పలువురు హాజరయ్యారు.

పేదల కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న నేత సీఎం జగన్ : డిప్యూటీ సీఎం బూడి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు, ఆనందం చూడాలనే ఆలోచనలతో పుట్టిందే వైఎస్సార్ సీపీ ఆని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా మహిళలకు, రైతుల రుణాలము మాఫీ చేయడంతో పాటుగా స్కూల్ పిల్లల తల్లులకు అమ్మఒడి పేరుతో డబ్బును ఖాతాలో జమ చేస్తున్నారని, అలాగే వృద్ధులకు పెన్షన్ మొత్తాన్ని రూ. 2700 పెంపు చేసారని, రానున్న జనవరి నుంచి రూ. 3 వేల రూపాయులు అందజేయనున్నారన్నారు. నాడు – నేడు పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో బోధన చేయడంతో పాటుగా అత్యాధునిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చి దిద్దారని గుర్తు చేశారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. పేదల కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న నేత జగన్ మాత్రమేనని గుర్తు చేసారు.

పొత్తులతో మాయగాళ్లు వస్తున్నారు.. జాగ్రత్త, అప్పుడు చేసిన మోసాలను గుర్తు చేసుకోండి : డిప్యూటీ సీఎం రాజన్న దొర

ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ రూ. 1600 కోట్లు విలువ చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ కురుపాం నియోజకవర్గ పరిధిలో చేపట్టామని, అభివృద్ధిపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీకి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సవాల్ చేస్తున్నా సరే ముందుకు రాకుండా తోక ముడుస్తున్నారన్నారు. గతంలో చెప్పిన పనులు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కొత్త హామీలు ఇస్తూ ముందుకు వస్తున్నారని, అవి నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనని హెచ్చరించారు. రూ. 87,600 కోట్లకు రైతు రుణ మాఫీ అని చెప్పి కేవలం 1700 కోట్లు మాత్రమే చంద్రబాబు మాఫీ చేసి మోసాడని, ఇదే రీతిలో డ్వాక్రా మహిళలను ముంచాడని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో మాయగాళ్లు వస్తున్నారని, గత మోసాలు గుర్తు చేసుకో ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకోవాలని రాజన్నదొర పిలుపునిచ్చారు ఏం పిల్లదో ఎల్దం వస్తావా అనే జానపదాన్ని వేదికపై రాజన్నదొర పాడి ఉత్సాహ పరిచారు.

పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేసి గిరిజనులకు గుర్తింపునిచ్చారు జగన్ : ఎంపీ గొట్టేట మాధవి

అరకు ఎంపీ గొట్టేట మాధవి మాట్లాడుతూ వెనుకబడిన గిరిజిన ప్రాంతాల అభివృద్ధికి జగన్ ముందు నుంచి కట్టుబడి ఉన్నారని, రాష్ట్రంలో సుమారు 8 కోట్ల మంది జనాభా ఉంటే సుమారు 45 లక్షల జనాభా కలిగిన గిరిజనులకు గుర్తింపును ఇస్తూ ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను మన ముందుకు తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజలు పట్ల సీఎం జగన్ ఎలాంటి అభిమానాన్ని ఆత్మీయతను కనబరుస్తున్నరో, అదే రీతిలో ప్రజలంతా కూడా వైసీపీ ప్రభుత్వానికి అండదండలుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలప్పుడే జగన్ రాజకీయాలు, పాలనలో సంక్షేమం, అభివృద్ఘికే పెద్ద పీట : ఎంపీ బెల్లాన

విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసారని పేర్కొన్నారు. ఎన్నికల సమయం వరకే రాజకీయాలను పరిమితం చేసి మిగిలిన సమయంలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని, గిరిజనం ప్రాంతంలో మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక విద్యను గిరిజనులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వెంటే నడవాలని, లేకుండా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.

విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడుగా జనగ్ ఉన్నప్పటి నుంచి కురుపాం ప్రాంత అబివృద్ధి పనుల కోసం ఆలోచించేవారని, అప్పుడు అధికారంలో ఉన్న నేతలు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగినా, సంక్షేమం అమలు చేసినా సరే అది జగన్ ద్వారా మాత్రమే సాధ్యమైందన్నారు. గత ఎన్నికల్లో ప్రజల అండదండలతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసిందని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రీతిలో ఆదరించాలని కోరారు. టీడీపీ నేతలు సుదీర్ఘకాలం ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినా సరే అభివృద్ధిని పట్టించుకోలేదని, జగన్ నాయకత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమం జరగనుందని వెల్లడించారు.

హామీలిచ్చి అమలు చేయని మోసగాడు చంద్రబాబు, ఇచ్చిన మాటను నెరవేర్చిన మోనగాడు జగన్ : ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి

కురుపాం ఎమ్మల్యే పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చేయలేని సామాజిక సాధికారతను తొలి సారి ముఖ్యమంత్రైన నాలుగున్నరేళ్లలోనే జగన్ చేసి చూపించారన్నారు. రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కురుపాం నియోజకవర్గానికి చెందిన, గిరిజన వర్గానికి చెందిన తనను రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిని చేసి సీఎం జగన్ తన ఆలోచనలు ఏంటో చాటి చెప్పారని వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు హయాంలో కనీస అభివృద్ధికి నోచుకోలేదని, జగన్ సీఎం కాక ముందు ఇక్కడ పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ స్థాయిలో ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నది ప్రజలే గమనించాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించిన ఘనత జగన్ దేనని, త్వరలో ప్రభుత్వ మహిళా కాలేజీని స్థాపించబోయేది కూడా ఆయననే వివరించారు. కురుపాం నియోజకవర్గంలో జగన్ హయాంలో జరిగిన అబివృద్ధి, సంక్షేమం, గతంలో ఎన్నడైనా జరిగిందా అన్న అంశంపై ప్రతిపక్షాలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గిరిజనులకు జగన్ ఎక్కువ మేలు చేసారా, బాబు చేసాడా అన్నది ప్రజలందరికీ తెలుసునన్నారు. హామీలిచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు అయితే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన మొనగాడు జగన్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఈ తూర్పు కనుమల్లో వైసీపీ జెండా జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఉద్ఘాటించారు. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ సీఎం జగన్ పరిపాలనా దక్షతను ప్రజలు మెచ్చబట్టే సామాజిక సాధికారత యాత్రకు ప్రజలు ప్రభంజనంలో పోటెత్తుతున్నారని వివరించారు. బీసీలు, ఎస్టీ, ఎస్సీలను తన పాలనలో ఘోరంగా అవమానించిన చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రజలు ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని గెలిపించాలని కోరారు. పార్వతీపుం మన్యం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు మాట్లాడుతూ, దేశంలో ఏ ఒక్కరూ సాధించలేని విజయాన్ని గత ఎన్నికల్లో సాధించిన ఒకే ఒక్కడు జగన్ అని, ప్రజలు ఇచ్చిన అండదండలతో ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. కురుపాం నియోజకవర్గంలో మరోసారి పుష్పశ్రీవాణిని గెలిపించి ఈ ప్రాంతాన్ని వైసీపీ కంచుకోటగా నిలపాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *