బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే.

రైతు గోస కాదు బీజేపీ గోస

టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

కూసుమంచి , ఆగస్ట్ 28 (పాలేరు ఎక్స్ ప్రెస్ న్యూస్):

నిన్న ఖమ్మం లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని రుజువైందని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు విమర్శించారు. రెండు పార్టీలు ఒకటే నని గుర్తించిన ఖమ్మం జిల్లా ప్రజలు మీటింగ్ కు రాకపోవడంతో ఇతర జిల్లాలు నుంచి జన సమీకరణ చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ సభ పెడితే కనీసం బస్సులు ఇవ్వని ఆర్టీసీ ఈరోజు బీజేపీ నిర్వహించిన సభకు సభాస్థలి వరకు బస్సులకు అనుమతి ఇవ్వడంతో వల్ల మధ్య లోపకారి ఒప్పందం భయట పడింది అన్నారు. అమితాషా వస్తే ఆర్టీసీ ఇవ్వడం తోనే ఈ రెండు పార్టీలు ఒకటే అని తెలిసిందని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాలుగా కేసిఆర్ చేసేది అవినీతి మయం అని అనడమేకానీ ఒక కేంద్ర హోంశాఖ మంత్రి గా కేసిఆర్ పై తీసుకున్న చర్యలు ఏమిటో వివరించలేక పోయారని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతు గోస కాదు బీజేపీ గోస లాగా ఉందని, రైతుల గురించి ఎం మాట్లాడారో ఎవరికి అర్థం కాలేదన్నారు. మొత్తానికి మాత్రం తెలుసుకున్న నీతి ఏమిటంటే బీఆర్ఎస్, బీజేపీ లు ఒకటే అని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారని రాయల నాగేశ్వరరావు ఒక్కాణించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *