ఇక బీఆర్ఎస్కు తుమ్మల బైబై..?

కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంచనమే…?
బీఆర్ ఎస్ బుజ్జగింపులు నో చెప్పిన తుమ్మల
తుమ్మలకు వెల్కం చెపుతున్న భట్టి
పాలేరు బరిలో ఫిక్స్ అంటున్న అనుచరులు
ఖమ్మం రూరల్, (పాలేరు ఎక్స్ ప్రెస్ న్యూస్) : ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరగని ముద్ర వేసి, పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాధించుకున్న నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పినట్టే. సీఎం కేసీఆర్ పాలేరు టికెట్ కేటాయించక పోవడంతో తుమ్మల అభిమానులు బీఆర్ఎస్పై గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాను అభివృద్ధి బాటలు తొక్కించిన నేత, అన్ని పార్టీల నుంచి అభిమానులను సంపాదించుకున్న తమ నాయకుడికి అవమానం జరిగిందని నాలుగేళ్లుగా పాలేరు టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసికూడా తుమ్మలకు సీటు ఇవ్వకపోవడం తుమ్మల కావాలనే బయటకు పంపే కుట్ర జరిగిందని అంటున్నారు. గత వారం నుంచి తుమ్మల రాజకీయ అడుగులపై ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. బీజేపీ సైతం ఆయనకు గాలం వేసినప్పటికీ జిల్లా రాజకీయాల్లో బీజేపీకి ఆదరణ లేకపోవడంతో బీజేపీ నేతలకు సున్నితంగానే తన అభిప్రాయాన్ని తుమ్మల చెప్పినట్లు సమాచారం. ఆయన అడుగులు కాంగ్రెస్ వైపే అంటున్నారు తుమ్మల అనుచరులు. దాదాపు ఖరారైనట్టుగానే చెపుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రతినిధులు తుమ్మలకు టచ్ లోకి వచ్చారని తెలుస్తుంది. రాహుల్ గాంధీ సైతం తుమ్మలతో నేరుగా ఫోన్ లో మాట్లాడని అంటున్నారు. తుమ్మల తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించనప్పటికీ ఆయన అనుయాయులు మాత్రం కాంగ్రెస్ లో చేరడం ఖాయమంటున్నారు. పార్టీ మార్పుపై తుమ్మల సుదీర్ఘంగా ఆలోచించారని బీఆర్ ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పార్టీ మారక తప్పడంలేదని అంటున్నారు. పాలేరు పోటీ చేయడం గెలవడం మాత్రం పక్కా అంటున్నారు. తుమ్మల అభిమానులు జిల్లా వ్యాప్తం ఉండటంతో ఖమ్మం నుంచి కూడా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆయన మాత్రం పాలేరు నుంచి పోటీ చేయడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం రూరల్ మండలం కాంగ్రెస్ నేతలు, తుమ్మల వర్గీయులు తుమ్మల స్వగ్రామం గండుగులపల్లి వెళ్లి కలిశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎప్పుడు వచ్చినా పాలేరు నుంచి గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు.

పునరాలోచనలో బీఆర్ఎస్ పార్టీ…
తుమ్మల విషయంలో తప్పటడుగులు వేసిన బీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. దిద్దుకోలేనంత పొరపాటు జరిగిందని కొందరు ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైయ్యాయి. తుమ్మలకు ఇప్పుడు పిలిచి టికెట్ ఇచ్చినా ఒప్పుకునే పరిస్థితిలో ఆయన లేడు. తుమ్మల తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానం ఎప్పడు జరగలేదని జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మందికి టికెట్స్ ఇప్పించిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. ఎంతో మందికి టికెట్లు ఇప్పించి తుమ్మల నేడు తన టికెట్ కోసం ఇంత మానసిక క్షోభ పెట్టిన కేసీఆర్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు తుమ్మల ఇంటికెళ్లినా ఆయనకు పార్టీలో సముచిన స్థానం దక్కుతుందని హామీ ఇవ్వలేక పోతున్నారు. తుమ్మల బీఆర్ ఎస్ ను వీడటంతో ఇక లాంచనమే అని అనుచరులు చెపుతున్నారు. తుమ్మల కాంగ్రెస్లో చేరితే ఉమ్మడి జిల్లాలో ఒకకసీటు కూడా బీఆర్ఎస్ గెలవలేదని విళ్లేషకులు చెపుతున్నారు. జిల్లాలో వార్ వన్ సైడ్ అవతుందంటున్నారు. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్లో ఉండగా ఇక తుమ్మల కూడా చేరితే జిల్లాలో కాంగ్రెస్ అత్యంత బలం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *