“నా సామిరంగా” మాస్ లుక్ లో నాగ్..!

అగ్ర హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రానికి ‘నా సామిరంగ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మంగళవారం నాగార్జున జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఫస్ట్ గ్లింపు ను విడుదల చేశారు. ఏఎన్నార్ నటించిన సిపాయి చిన్నయ్య సినిమాలోని ‘నా సామిరంగా అనే పాటను టైటిల్ గా తీసుకోవడం విశేషం. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జున మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇక ఫస్ట్ గ్లింప్స్ లో ఆయన ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ యాక్షన్ మోడ్ లో కనిపించారు. నాగార్జున మాస్ లుక్స్, విజువల్స్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *