హాయిగా నిద్రపోండిలా..!

నిద్రలేమి సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారు పడుకునేముందు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..

1.ఓట్స్:

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ నిద్రపుచ్చడంలో కూడా బాగా పనిచేస్తాయని తేలింది. ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ శరీరాన్ని, బ్రెయిన్ నీ ప్రశాంతంగా మార్చి నిద్రాభంగం లేకుండా చూస్తాయి.

2.అరటి పండ్లు:

మెగ్నీషియం, సెరోటోనీన్, మెలటోనిన్ ఉండే వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కాబట్టి బాగా పండిన అరటిపండుని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.

3.బాదం:

హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం ఉన్న బాదం కూడా మంచినిద్రకు దోహదం చేస్తుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి.

4.కివి:

ముదురు-ఆకుపచ్చ, తీపి-పుల్లని రుచి కలిగిన కివీ పండు మీరు ఊహించని విధంగా విటమిన్ సితో నిండి ఉంటుంది. కివీ పండు యొక్క ఒక ముక్కలో 273 mg విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి కాకుండా, కివి పండులో విటమిన్ ఎ, ఫైబర్ మరియు కాల్షియం కూడా ఉన్నాయి. సెరోటోనిన్ గల కివీ ఫ్రూట్స్ ను తినడం వల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది.

5.వాల్ నట్స్:

మెలటోనిన్ అనే పదార్థం హాయిగా నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. వాల్ నట్స్ లో ఈ పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తినండి.

6.చెర్రీస్:

వాల్ నట్స్ లో ఉన్నట్లుగానే మెలటోనిన్ ఇందులోనూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెర్రీలను కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి.

7.తేనె:

తేనె తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇందులోని మెలటోనిన్ ఇలా చేస్తుంది. కాబట్టి హాయిగా నిద్రపోవాలనుకునేవారు తేనెని తీసుకోవచ్చు.

8.గుడ్లు:

అమైనో యాసిడ్స్ గల గుడ్డు కూడా నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *