ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా-పాలకుర్తి గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం-పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి

తొర్రూరు:

ఈ శాసనసభ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి అన్నారు.

మండలంలోని సోమారపుకుంట తండా, మడిపల్లి, కంటాయపాలెం, గుడిబండ తండా, హచ్చు తండాల్లో గడపగడపకు కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమం చేపట్టారు. దానిలో
భాగంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డికి బతుకమ్మలతో, బోనాలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం నిర్వహించిన సభలో యశస్విని రెడ్డి మాట్లాడుతూ….

అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, కేవలం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి, అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులందరికీ ఆరు గ్యారెంటీ కార్డులు అమలుచేసి మాట నిలబెట్టుకుంటామన్నారు. కేసీఆర్ గిరిజనులకు గిరిజన బంధు ఇస్తానని, మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చెప్పిన దళిత బంధు ఏ ఒక్క లబ్ధిదారునికి ఇవ్వకపోగా, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గిరిజన బంధు మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, రాబోయే 15 రోజులు నాకోసం కష్టపడండని, వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానన్నారు. ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతానికి కూడా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికులు లాగా పని చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *