అంచనాలని మించే “ప్రాజెక్ట్ కే”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కే”. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి సెన్సిబుల్ కథలను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో చేసిన కథలకు పూర్తి భిన్నమైన కథ ప్రాజెక్ట్ కె. ఇది దర్శకునిగా అతనికో ఛాలెంజ్. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇది ఎవరూ ఊహించని కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఫలానా తరహా కథ అంటూ గతంలో చాలా గాసిప్స్ వచ్చినా అవేమీ నిజం కాదని విశ్వసనీయవర్గాల సమాచారం. నిజానికి ‘ప్రాజెక్ట్ కె’ తరహా సినిమా భారతీయ సినీచరిత్రలో రాలేదని తెలుస్తోంది. సగటు ప్రేక్షకుడు ఊహించని కథాకథనాలతో ఈ సినిమా రాబోతున్నది. భారతీయ విజ్ఞానం, మన పురాణ ఇతిహాసాలు, భారతీయ చరిత్ర ఇవన్నీ కథలో మిళితమై ఉంటాయని సమాచారం. ఓ విధంగా చెప్పాలంటే ఇదొక యూనివర్సల్ కాన్సెప్ట్. తెరపై ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించనున్నాడు నాగ్ అశ్విన్. ఇందులోని పాత్రధారుల వేషధారణలు కూడా కొత్తగా ఉంటాయని తెరపై వాతావరణం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తున్నది. కథానుసారం అందరి పాత్రలూ గొప్పగానే ఉన్నా.. కమల్ హాసన్ పాత్ర మాత్రం సినిమాకే హైలైట్ గా నిలువనుందని తెలిసింది. ఆశ్చర్యంతో కూడిన భావోద్వేగం.. అంచనాలకు మించిన ప్రాజెక్ట్ కే తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే స్థాయిలో ఉండబోతుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *