త్వరలో పట్టాలెక్కనున్న బన్నీ, త్రివిక్రమ్ ల చిత్రం..?

బన్నీ, త్రివిక్రమ్ కలయికలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియే షన్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించబోతున్న విషయం తెలిసిందే.. పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. కథాపరంగా ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉందని అది ఓ సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో సినిమాలు ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. దాంతో వీరి కలయికలో వస్తున్న ఈ నాలుగో సినిమాపై భారీ అంచనాలున్నాయ్. ‘పుష్ప – 2’ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న బన్నీ త్వరలోనే ఈ సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *