శర్వానంద్ తో జంట కట్టనున్న సాక్షి వైద్య..!

‘ఏజెంట్’ సినిమా తో ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి వైద్య అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో జోరు ప్రదర్శిస్తోంది. ఇటీవలే ‘గాండీవధారి అర్జున’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ మంచి స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ‘ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్ తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే శర్వానంద్ తోనూ జట్టు కట్టనుంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో శర్వా నంద్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య ను కథానాయికగా ఎంచుకున్నారు. ఈ కలయికలో త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *