ఏఈఓలకు శిక్షణ కార్యక్రమం..

కూసుమంచి , ఆగస్ట్ 30(పాలేరు ఎక్స్ ప్రెస్ న్యూస్):

కూసుమంచి మండల కేంద్రంలోని రైతు వేదికలో సాగు బాగు కార్యక్రమంలో భాగంగా కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఏఈఓ లకు ప్రతి దినం రైతులతో ఎలా వ్యవహరించాలి, శిక్షణలు ఎలా ఇవ్వాలో ఇలాంటి శిక్షణల ద్వారా నేర్చుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ గ్రీన్ జిల్లా కోఆర్డినేటర్ యశోద వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు శిక్షణ ఇచ్చేటప్పుడు రైతులతో సంభాషించేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, శిక్షణ కార్యక్రమం నిర్వహించాలంటే ఏ ఏ మెలకువలు పాటించాలి, ఎలాంటి వాతావరణం ఏర్పరచుకోవాలి, రైతులతో కలుపుగోలుగా ఏ విధంగా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై గ్రూప్ ఆక్టివిటీస్ ద్వారా ఏఈఓలకు వివిధ ఆటలు ద్వారా ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవోలు వాణి, నాగేశ్వరరావు ,సీతారాం రెడ్డి మరియు మూడు మండలాల వ్యవసాయ విస్తరణా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *