ఆ స్టార్ హీరో సినిమాలో వైష్ణవి..?

సినీరంగంలో ఎదగాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు. ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. మన బేబీ వైష్ణవికి టాలెంట్ తో పాటు చాలానే అదృష్టం ఉందనే చెప్పాలి. లేకపోతే ఇన్ స్టాగ్రా. మ్లో రీల్స్ చేసుకునే అమ్మాయి. ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘బేబీ’ సినిమాలో ఈ అమ్మాయి నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడనే చెప్పాలి. ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ ఇప్పుటికి 90 కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగానే ప్రస్తుతం వైష్ణవి ఇంటికి నిర్మాతలు కడుతున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం హీరోయిన్ గా ఈ అమ్మాయి లైనప్ మామూలుగా లేదని తెలుస్తున్నది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే ఈ అమ్మాయి డేట్స్ కోసం పోటీపడుతున్నారట. ప్రస్తుతానికైతే గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ చిత్రానికి కథానాయికగా వైష్ణవి ఎంపికైనట్లు తేలిసింది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలోనూ వైష్ణవి ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *