అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డ్..!

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతున్నది. ఈ విజయానందాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ‘పుష్ప -2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. బుధవారం ఆయన తన అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన దినచర్యతో పాటు ‘పుష్ప-2’ మేకింగ్ వీడియోను అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. తన ఇంటి నుంచి మొదలుకొని నెట్ వరకు సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ‘పుష్ప 2’లోకేషన్ లో దర్శకుడు సుకుమార్ తో బన్నీ మాటామంతీ.. ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొనడం వరకు ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిని పంచింది. “ఇతర దేశాల కంటే మన దగ్గర అభిమానులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ల ప్రేమకు హద్దులు ఉండవు. వారందరూ గర్వపడేలా నేను. నడుచుకుంటాను. ‘పుష్ప-2’ నా 20వ చిత్రంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో నాకు అన్నింటికంటే నచ్చిన పాత్ర పుష్పరాజ్ పాత్రే. అతను దేనికీ వెనకడుగు వేయడు” అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ టీమ్ షూట్ చేసింది. ఇన్ స్ట్రా గ్రామ్ భాగస్వామ్యంతో వీడియో చేసిన తొలి భారతీయ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *