దళపతి డబుల్ ధమాకా..?

‘లియో’ తర్వాత విజయ్ చేయనున్న చిత్రం ఇప్పటికే ఖాయమైంది. విజయ్ 68వ చిత్రంగా పట్టాలెక్కనున్న ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నారు. ప్రభుదేవా, జై తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో తండ్రిగా మరో పాత్రలో కొడుకుగా కనిపించనున్నారట. ఈ పాత్రల్లో ఒకటి రా ఏజెంట్ అని తెలిసింది. తండ్రి పాత్ర కొడుకుతో తలపడే విధంగా ఉంటుందని.. అదే ఈ కథలో ఆసక్తికర అంశమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయ్ చివరిగా ‘బిగిల్’లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభి నయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *