చిచ్చా వస్తే ఎట్లుండాలె..?

తెరపైన బాబాయ్ గా సందడి చేయనున్నారు బాలకృష్ణ ఆయన ‘బిడ్డా…’ అంటూ ముద్దుగా పిలుచుకునే అమ్మాయిగా శ్రీలీల కనిపించనున్నారు. ఈ బాబాయ్, ఆ అమ్మాయిల కథేమిటో తెలియాలంటే ‘భగవంత్ కేసరి’ చూడాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బాలకృష్ణ, కాజల్ ఆగర్వాల్ జంటగా నటిస్తున్నారు. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. గణేశ్ సంబరాల నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలోని తొలి పాటతో సంగీత ప్రచార కార్యక్రమాల్ని మొదలుపెట్టింది చిత్రబృందం. సెప్టెంబరు 1న పూర్తి పాట విడుదల కానుండగా, బుధవారం ప్రోమోని విడుదల చేశారు. ‘చిచ్చా వచ్చిండు.. ఎట్లుండాలె’ అంటూ బాలకృష్ణని ఉద్దేశించి శ్రీలీల చేసిన సందడి ఈ ప్రోమోకి ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పనున్నారు. హిందీ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. దసరా సందర్భంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్, కూర్పు, తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *