సెప్టెంబర్ 1న ఉపాధ్యాయ సమస్యల సాధనకై చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి.-కోర్టు తీర్పును అనుసరించి తక్షణమే బదిలీలు పదోన్నతులు ప్రక్రియ చేపట్టాలి

ఖమ్మం..31-08-2023

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధన కోసం సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ ఆర్.లక్ష్మణరావులు డిమాండ్ చేశారు.
UTF మధిర ప్రాంతీయ కార్యాలయం నందు UTF మండల అధ్యక్షులు ఎ.వినోద రావు అధ్యక్షతన జరిగిన మండల ఆఫీస్ బేరర్స్ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు తీర్పుతో బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియకు మార్గం సుగమం అయిందని ఈ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని,బదిలీలలో ‘0’ సర్వీస్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలైన సిపిఎస్ రద్దు- ఓపిఎస్ పునరుద్ధరణ, ఇంటీరియరమ్ రిలీఫ్ ప్రకటన, పెండింగ్ PRC, DA బిల్లుల జమ* తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు 317 తో స్థానికత కోల్పోయిన, నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజు ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో UTF మండల ఉపాధ్యక్షులు వీరయ్య, కార్యదర్శులు GBMS రాణి, భీమశంకరరావు సాధుసమాదానం, ఇబ్రహీం, భాస్కర రావు, కొండలరావు, చెన్నయ్య, రాజు, రమేష్* తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *