బీ అర్ ఎస్ లో చేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు…

200 మందితో కలిసి గులాభి కండువా కపుకున్న యాతకుల భాస్కర్ మాదిగ

దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న భాస్కర్ : ఎంపీ నామ నాగేశ్వరరావు

దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరారు : నామ

ఖమ్మం రూరల్, (పాలేరు ఎక్స్ ప్రెస్ న్యూస్): హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గురువారం రాష్ట్ర మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాతకుల భాస్కర్ మాదిగ నేతృత్వంలో 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి హరీష్ రావు, ఎంపీ నామ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాతకుల భాస్కర్ మాదిగ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోరేపల్లి శ్రీనివాస్ మాదిగ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువసేన అధ్యక్షులు జెర్రిపోతుల నరేష్ మాదిగ , ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి సగరంత్రి కోటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు , బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దసారి సతీష్ యాదవ్, మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా ఇంచార్జి జెఆర్ కుమార్ మాదిగ తదితర 200 మంది ఎం ఆర్ పి ఎస్ కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, ఎంపీ నామ మాట్లాడుతూ యాతకుల భాస్కర్ మాదిగ రాష్ట్ర నాయకునిగా అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్లు ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారని చెప్పారు. మందకృష్ణ తర్వాత తానే అన్నట్లు దళిత ఉద్యమాల్లో భాస్కర్ పని చేశారని అన్నారు. దళిత , వామ పక్ష ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంబేద్కర్ స్పూర్తితో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఆకర్షితులై భాస్కర్ బీఆర్ఎస్ లో చేరారని నామ నాగేశ్వరరావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *