రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేపడుతాం: రాయల

రైతులకు 24 గంటల విద్యుత్ సక్రమంగా అమలు చేయకడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని,కరెంటు కష్టాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతులకు ఇస్తానన్న 24 గంటల కరెంటు ఇవ్వకపోతే రైతుల పక్షాన పోరాడతామని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు ఒక ప్రకటన ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్నీ హెచ్చరించారు.

తిరుమలాయపాలెం ఆగస్టు 31, (పాలేరు ఎక్స్ ప్రెస్ న్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన 24 గంటల కరెంట్ రైతులకు అందిస్తున్నామని చెపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో ఎక్కడ అమలు జరుగుతుందో చూపించాలని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బోర్లు,బావుల కింద రైతులు సాగు చేసిన పంటలు కరెంటు లేక ఎండిపోతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైన లేదని ఆయన మండిపడ్డారు.వేలకు వేలు పెట్టుబడిపెట్టిన రైతుల పంటలు విద్యుత్ లేక పోవడంతో నీరు పెట్టక ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు 24 గంటల కరెంటు అందించాలని రాయల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *