విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి

  • మున్సిపల్ కమిషనర్ సరస్వతి

తొర్రూరు:
విద్యార్థులు లక్ష్యసాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ పుప్పాల సరస్వతి అన్నారు.

శనివారం డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ జాటోతు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సరస్వతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కమిషనర్ మాట్లాడుతూ…
ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యం పెంపొందించుకోవాలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుని కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకుంటూ, సమ యపాలనతో ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు.
లక్ష్య సాధన పోరాటంలో విద్యార్థులు ఓటమిని సైతం గుణపాఠంగా నేర్చుకుని ఇష్టంతో కష్టపడి చదవాలని సూచించారు.
నేటి ఆధునిక కాలంలో చదువుల భారంతో విద్యార్థులు మానసిక సంఘర్షణ పడుతున్నారన్నారు. వాటి నుంచి విద్యార్థులు బయటకి వచ్చేలా టీచర్లు ప్రత్యేకంగా పర్సనాలిటీ, కెరియర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి. అశోక్, డైరెక్టర్లు ఎం. సాగర్, బి. శ్రీను, ట్రైబల్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు లాకావత్ యాదగిరి నాయక్, మున్సిపల్ మేనేజర్ కట్ట స్వామి, జర్నలిస్టు జిలుకర రాజు, అధ్యాపకులు ఏ. శ్రీనివాస్, బి. వెంకన్న, జి. కృష్ణ, బి. దివ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *