దయాకర్ రావు పర్వతగిరికి ప్యారా ప్యారా చూటు రెడీ చేసుకో:

కమిషన్లు సరిపోలేదా చివరి అన్ని కాని మళ్లీ పోటీ చేస్తున్నావ్ :
దగాకోరు దయాకర్ ను నమ్మితే జీవితాలు అధోగతే:
గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం:
పాలకుర్తి గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాయం : ఝాన్సీ యశస్విని రెడ్డి
కొడకండ్ల: గతసారి ఎన్నికల్లో ఇవే చివరి ఎన్నికలంటూ ఓటు వేసి గెలిపిస్తే మంత్రి నైతానని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు కమిషన్లు సంపాదనసరిపోక మళ్లీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని దగాకోరు దయాకర్ ను నమ్మితే మన జీవితాలు అదోగతేనని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మంగళవారం కొడకండ్ల మండలం జిబి తండా, హాక్య తండ పాకాల రామవరం గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి తో కలిసి ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మహిళలు బతుకమ్మలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఊసరవెల్లి దయాకర్ రావు తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పర్వతగిరికి వెళ్లేందుకు దయాకర్ రావు ప్యారాచూట్ సిద్ధం చేసుకోవాలని,
పేదలకు భూములు ఇవ్వాలన్న, ఇండ్లు కట్టించలన్న, మన పొలాలకు నీళ్ళు రావాలన్న, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న, పరిశ్రమలు ఏర్పాటు జరగాలన్న రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆమె అన్నారు.9 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పేదల జీవితాలను ఆగం చేశారని,, తెలంగాణ రాష్ట్రమీచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి తొమ్మిది సంవత్సరాల చేయని అభివృద్ధి, ఐదు సంవత్సరాలు చేసి చూపిస్తాం అని ఆమె అన్నారు.దళిత బందు ఇయ్యలే, బీసీ బందు ఇయ్యలే, గిరిజన బందు ఇయ్యలే, డబల్ బెడ్ రూమ్ ఇయ్యలే, గృహలక్ష్మి ఇయ్యలే…
అన్నీ బంద్ చేసిన బీ ఆర్ ఎస్ సర్కారును కూడా డిసెంబర్ 30 తేదీన బంద్ చేద్దామని ఆమె కోరారు.
కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 45 రోజులు మీరు నాకోసం కష్టపడి గెలిపిస్తే ఐదేళ్లు మీ సేవకురాలుగా పనిచేస్తూ, ఎమ్మెల్యేగా వచ్చే వేతనాన్ని కూడా మీకే అంకితం చేస్తూ అభివృద్ధికి వెచ్చిస్తానని,వచ్చే ఐదేళ్లు మీ అభివృద్ధి కోసం నేను కష్టపడతానని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఈ దగా దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ఒక సైనికులు లాగా పనిచేయాలనీ ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ నాయక్, జిల్లా కార్యదర్శి సోమ నరసయ్య, మాజీ ఎంపీటీసీ మోర్తాల రమ,నాయకులు వెంగళరావు మహేందర్ బిక్షపతి రవీందర్ వెంకన్న శ్రీకాంత్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *