బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీపీ

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కంజర్ల ఎల్లయ్య
రాయపర్తి: రాయపర్తి మాజీ ఎంపీపీ, మండలంలోని మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన కంజర్ల ఎల్లయ్య బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కంజర్ల ఎల్లయ్య మాట్లాడుతు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధితో ఆయన వెంటే నడవాలని బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. ఆయన గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు గబ్బేట బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *