తెలంగాణ జాగో వేదిక కన్వీనర్ ఆకునూరి మురళి

కొడకండ్ల:గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం,కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతం చేయాలంటే వారిని ఇంటికి పంపించాలని జాగో తెలంగాణ వేదిక కన్వీనర్,మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ ఓటర్ల చైతన్య ప్రచార యాత్రలో భాగంగా శుక్రవారం కొడకండ్ల బస్టాండ్ లో ప్రజలతో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రజల అభివృద్ధి కోసం పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలమై తన కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే చేసుకున్నారని ఆరోపించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఆశలను ఆకాంక్షలను తీర్చుకోవటం కోసం గత పది సంవత్సరాల నుండి కోచింగ్ తీసుకుంటూ నిరుద్యోగులు ముసలి వాళ్ళ అవుతున్నారని అన్నారు. 22 లక్షల మంది గా ఉన్న కౌవులు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా విదేశాలలో స్థిరపడ్డ వ్యాపారస్తులకు, సినిమా హీరో హీరోయిన్లకు 18 లక్షల కోట్లు రైతుబంధు రూపేనా సహాయం చేయటం ఏమిటని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి అందరిపై అప్పుల భారాన్ని మోపుతూ అవినీతి పరిపాలన సాగిస్తున్నాడని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయల నల్లధనాన్ని అకౌంట్లో వేస్తానంటే ఐదు కోట్ల మంది ఖాతాలు తెరిచారని ఎవరికీ రూపాయి వేయలేదని ఆరోపించారు. కలిసున్న ప్రజల మధ్య మతాల మధ్య కులాల మధ్య కొట్లాటలు పెట్టించి ఆ మంటలలో చలిగాసుకుంటున్న మోడీ సర్కారు విధానాలపై పోరాడటం అంటే బిజెపిని ఓడించటమే అన్నారు.కారు,పువ్వు లపై కాకుండా ఇష్టం వచ్చినవారికి ఓటు చేసుకోవాలని ఎవరు ఇష్టం లేకపోతే నోటాకు వేసుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ యాత్ర సమన్వయకర్త నైనాల గోవర్ధన్ అధ్యక్షత వహించగా భాగస్వామ్య సంస్థ నుఁడి రిటైయిర్ ప్రో పద్మజా ,కొత్తపల్లి రవి లు మాట్లాడుతూ మన బ్రతుకులను భోగి పాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఓటు రూపంలో గుణపాఠం చెప్పాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ప్రొఫెసర్స్ వినాయక రెడ్డి,దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్ శంకర్,,ముంజంపల్లి వీరన్న,కల్పన, గౌస్ సంధ్య,సౌజన్య,రాములు,నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *