డిసెంబర్ 3న ముడసర్లోవలో విశాఖ కాపు యూత్ కార్తీక వన సమారాధన

6 వేల మంది కి ఏర్పాట్లు

ప్రవేశం ఉచితం

విశాఖపట్నం : డిసెంబర్ మూడో తేదీ ఆదివారం ముడసర్లోవ పార్కులో విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మద్దిం శెట్టి సురేష్ తెలిపారు. సోమవారం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు, తూర్పుకాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు కులాలకు చెందిన వారికోసం వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తా మన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎర్రంసెట్టి సురేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కార్తీకమాసంలో ఈ కార్యక్రమం నిర్వహించి అందరం ఒక చోట చేరి తమ సాధక బాధకాలు చర్చించు కుంటున్నా మన్నారు. సుమారు అయిదారు వేల మందితో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు వస్తారన్నారు. ప్రవేశం ఉచితం అయిన ఈ కార్యక్రమంలో పలు వ్యాపార స్టాళ్ళ ఏర్పాటుతో పాటుగా మ్యారేజ్ బ్యూరో కూడా నిర్వ హిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. అసోసియేషన్ నాయకుడు గొల్ల కోట సుబ్బారావు మాట్లాడుతూ సింహాచలం వరహా నరసింహ స్వామి ఆశీస్సులతో, అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయ వంతం చేస్తామన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ఈ కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం శ్రీను బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఈ కార్తీక వన భోజన కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించడం ఆనందంగా వుందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బలిరెడ్డి సుహాస్, అసోసియేషన్ కోశాధికారి సూదాబత్తుల సత్యన్నారాయణ, నేవల్ డాక్ యార్డ్ అధ్యక్షుడు చిరంజీవి, చిన్నా,అసోసియేషన్ నాయకులు ఫాల్గొని తమ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *