సంపూర్ణ అభివృద్ధి దిశగా అడుగులు

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
    రాయపర్తి: కొట్లాడి సాధించుకున్న రాష్టంలో ప్రజలు పట్టం కడితే చెప్పినవే కాకుండా చెప్పని పనులు చేసి సంపూర్ణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గడప గడప కు బీఆర్ఎస్ పల్లె పల్లె కు దయన్న కార్యక్రమంలో భాగంగా సోమవారం బంధన పల్లి, కొత్తూరు, పెర్కవేడు, కొండాపురం, జగన్నాధపల్లి, ఊకల్, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, శివరామపురం, మైలారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనకు మహిళలు బోనాల, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. అన్నీ వర్గాల ప్రజల అభ్యన్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఏళ్ల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదన్నారు.మాయ మాటలు, బుటకపు హామీలతో వస్తారని వారి మాటలు నమ్మి మోస పోవద్దన్నారు. తట్టేడు మట్టి పోయని వారు తామేదో చేస్తామని చెప్పే మాటలు ప్రజలు నమ్మరన్నారు. తనపై నమ్మకంతో ఏళ్ల నుంచి ఆశీర్వాదం అందించారని మరో మారు ఆశీర్వదిస్తే కార్యకర్తల ఉన్నతికి కృషి చేస్తానన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానన్నారు. తనకు మంచి మెజారిటీ ఇస్తే పెర్కవేడు ను మండలం చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, బీఆర్ఎస్ మండల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అధ్యక్షులు మునవత్ నరసింహ నాయక్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు ఆకుల సురేందర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ కందికట్ల స్వామి, దీప్లా నాయక్, చిన్నాల తారశ్రీ రాజబాబు, కోదాటి దయాకర్ రావు, గూడెల్లి శ్రీలత శ్రీనివాస్, నాయకులు కాంచన పల్లి వనజ రాణి, నర్మద, నాగపూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *