రాజకీయాల్లో మార్పుకు యువత నాంది పలుకాలి

–పాలకుర్తి నుంచి పర్వతగిరికి ఎర్రబెల్లిని పంపిద్దాం
– సోనియాగాంధీ కృతజ్ఞతగా కాంగ్రెస్‌ను గెలిపించండి
–బీఆర్‌ఎస్‌ నుంచి వీడీన నాయకులపై విమర్శలు తగవు
–పాలకుర్తి ఎమ్మేల్యే మామిడాల యశస్వినిరెడ్డి
పాలకుర్తి ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌నెట్‌ వర్క్‌ ః
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా రాజకీయాల్లో మార్పుకు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా యువత నాంధి పలుకాలని పాలకుర్తి ఎమ్మేల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం హైదరాబాద్‌లో పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన ఆత్మీయ సమ్మేళన సమావేశానికి కాకిరాల హరిప్రసాద్‌ అధ్యక్షత వహించగా ఆమె మాట్లాడారు.ఈ జనాదరణ చూస్తుంటుంటే గెలుపు ఖాయమనిపిస్తోందన్నారు. ఫ్రజాసేవ చేయాలంటే అధికారం లే కున్నా సేవ చేసే తమ కుటుంబం రాజకీయాల్లోకి వస్తే ఏంత అభివృద్ది చేస్తామో ఆలోచించాలన్నారు. అమెరికా నుంచి వచ్చామనీ, తిరిగి వెళ్తారనే వదంతులు నమ్మవద్దని, దయాకర్‌రావు పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ కాంగ్రెస్‌ శ్రేణుల ఆహ్వానం పలికితే వచ్చామన్నారు. ఇక రాజకీయంలో తగ్గేదీలేదన్నారు. కరవు కాటకాల్లో అన్నదాతల కష్టాలను ఎరిగిన దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ హాయాంలోనే ఇక్కడ కరెంటు ఉత్పత్తి చేయడంతోపాటు ఉచిత విద్యు™Œ అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. అదే ప్రణాళికల స్పూర్తితో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌ తీరు దయ్యాలు వేదాలను చదివినట్టు ఉన్నదన్నారు. వయోవృద్ధులైన భార్యభర్తలకు ఆసరా , యువతుల కళ్యాణలక్ష్మీ రూ.లక్షతో పాటు తులం బంగారం, విద్య, వైద్య, ఉద్యోగ ఉపాధి రంగాలకు ప్రత్యేక కార్యాచరణతో తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేయకుండా ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కార్యకర్తలకే ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తరనీ తస్మాత్‌ జాగ్రత్త అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కులాలకతీతంగా సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు,ఎకకాలంలో రుణమాపీ, ఆరోగ్యశ్రీ ఇచ్చింది నిజమ కాదా.. అన్నారు. ప్రత్యేక పాలన కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలోని పాలకుర్తి ఉద్యమాల గడ్డలో అక్రమ కేసులు పెట్టి అణిచివేస్తున్నారనీ, సీసీ రోడ్లు కమీషన్‌లు కోసం..డబుల్‌బెడ్‌ రూమ్‌ కట్టిందే తక్కువ కట్టినా నాణ్యత లేదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ఓట్లు..డబ్బులు తీసుకొండి. మీ దగ్గర దోచుకొని దాచుకున్న సొమ్మును ఎడమ చేతితో తీసుకొని కుడి చేతితో హస్తం గుర్తుకే ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. తెంలగాణకు మిగులుబడ్జెట్‌తో కెసీఆర్‌కు అప్పగిస్తే అప్పులు పాలు చేశారన్నారు. యువత అమూల్య మైన ఓటును బిర్యానీ, మద్యం,డబ్బులు వంటి ప్రలోభాలకు గురికాకుండా ఐదేళ్ల భవిష్యత్తు కోసం ఆలోచించాలన్నారు. గృహాలక్ష్మీ, దళిత, గిరిజన, బీసీ బంధు పథకం అమలు ఓ నాటకం…ఆచరణలో బూటకం అనీ బంగారు తెలంగాణ అనీ చెప్పి ఊరూరా బెల్టుషాపులు పెట్టిన పచ్చని సంసారాల్లో చిచ్చులతో అనేక కుటుంబాలు వీ««ధిన పడ్డాయన్నారు. ఓయు జెఎసీ మైలపాక ప్రసాద్‌ మాట్లాడుతూ ఉసరవెల్లి దయాకర్‌రావును పాలకుర్తి గడ్డ నుంచి పర్వతగిరికి తరిమికొట్టాలన్నారు, గ్రూప్‌ –1 క్వాలీపయ్‌ అయినప్పటీకీ ప్రభుత్వ చిక్కులతో కాలంగడపాల్సి వస్తుందనీ, కాంగ్రెస్‌ మేనిఫేస్టోలో ఉద్యోగ క్యాలెండర్‌ స్పష్టత ప్రకటించగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల నియమాకంపై బీఆర్‌ఎస్‌ ఊసేత్తలేదన్నారు.సాప్ట్‌వేర్‌ అసోసియన్‌ ప్రతినిధి వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ఝాన్సీరెడ్డి కుటుంబం యశస్వినిరెడ్డిని రంగంలోకి దింపిన క్రమంలో యువత కాంగ్రెస్‌కు తోడ్పాటు అందించాలన్నారు. ఎర్రబెల్లి రాఘవరావు మాట్లాడుతూ వర్దన్నపేట, పాలకుర్తి నియోజకవర్గంలో పలు పర్యాయాలు నిన్ను గెలిపించిన క్యాడర్‌ పార్టీ మారితే అమ్ముడు పోయారని ఆరోపించడం తగదన్నారు. .సమావేశంలో నెమరుగొమ్ములు ప్రవీణ్‌రావు ఎర్రబెల్లి రాఘవరావు, కుందూరు గోపాల్‌రెడ్డి, ఆయా మండలాల అ«ధ్యక్షుడు పెద్ది కృష్ణమూరి, సురేష్, గిరగాని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *