కాంగ్రెస్ తోనే యువత అభివృద్ధి

  • ఓటు అస్త్రంతో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి
  • తొర్రూరు కౌన్సిలర్ రోజా ప్రభుదాస్, యువ నాయకుడు శ్రావణ్
    తొర్రూరు:
    కాంగ్రెస్ తోనే యువత అభివృద్ధి సాధ్యమని, పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ఉపాధి అవకాశాలు దక్కుతాయని
    తొర్రూరు కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్,యువ నాయకుడు తూనం శ్రావణ్ కుమార్ లు అన్నారు.

పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపు కోరుతూ కాంగ్రెస్ యువజన నాయకుడు తూనం శ్రావణ్ ఆధ్వర్యంలో పట్టణంలోని బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 2 వే ల మందితో సోమవారం డివిజన్ కేంద్రంలో గడపగడప ప్రచారం చేశారు.
బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.
అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కరపత్రాలను అందజేశారు.

అనంతరం కౌన్సిలర్ రోజా, యూత్ నాయకుడు శ్రావణ్ లు మాట్లాడుతూ…6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ రావు పాలకుర్తి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిలు ఆస్తులు కూడబెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేసేందుకే వచ్చారని స్పష్టం చేశారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్లు అమెరికాకే వెళతారని గులాబీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఎర్రబెల్లి ఓడిపోయాక వెళ్ళేది అమెరికాకేనని స్పష్టం చేశారు. పదవిలేని సమయంలోనే ప్రజాసేవకు వందల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఝాన్సీ రెడ్డి కుటుంబానిదని గుర్తు చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ బుటకపు హామీలు ఇస్తుందన్నారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చలేదన్నారు.యువకులకు ఉద్యోగాలు కల్పించాల్సింది బెల్ట్ షాపులు పెంచి తాగుడుకు బానిసల్ని చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ళు కట్టుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇవ్వనుందన్నారు. యశస్విని రెడ్డిని గెలిపిస్తే వచ్చే జీతాన్ని సైతం ప్రజా సేవకే వినియోగిస్తారన్నారు.
కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ స్కీం లు తప్పక అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ గెలుపు తథ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు పెదగాని సోమయ్య,తిరుపతి రెడ్డి,చిత్తలూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమరాజశేఖర్, స్థానిక కౌన్సిలర్లు భూసాని రాము, నర్కూటి గజానంద్, నాయకులు బిక్షం గౌడ్, ధరావత్ సోమన్న, సర్వి వెంకన్న, కోటగిరి సుదర్శన్,అలువాల సోమయ్య, వెంకటేశ్వర్లు,కుశాల్, రాంబాబు, ముదసాని సురేష్,రామ్మూర్తి యాదవ్,వెంకన్న యాదవ్,సాయి ముఖేష్,మనోహర్, రామ్మూర్తి,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *