సీఎం కేసీఆర్ చోరవతోనే తండాలు అభివృద్ధి

  • బానోత్ రవీందర్ నాయక్
    పెద్దవంగర:
    సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలు అభివృద్ధి చెందాయని ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు బానోత్ రవీందర్ నాయక్ అన్నారు సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాల్లోని గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం మారుమూల తండాలను సైతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి తండాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. గత పాలకుల హాయంలో తండాలను పట్టించుకోకపోవడంతో అన్ని విధాలుగా అస్తవ్యస్తంగా ఉండేవని పేర్కొన్నారు. నేడు సీఎం కేసీఆర్ చొరవతో ప్రతి తండాకు తారు రోడ్డు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఎస్సారెస్పీ జనాలతో తండాల్లో ఉన్న ప్రతి కుంటలను గ్రామాల్లో చెరువులను నింపారని చెప్పారు. దీంతో వ్యవసాయ రంగంలో సాగులో ప్రతి పల్లెతోపాటు తండాలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఏదో విధంగా ప్రతి ఇంటికి అందుతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీరుతోపాటు ఉచితంగా విద్యుత్ అందించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పాలకుర్తి నియోజకవర్గం లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత మంత్రి దయాకర్ రాదేనని అన్నారు. ఈనెల 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి దయాకర్ రావుకు గిరిజన ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, హెమని నాయక్, గోపాల్ నాయక్, పటేల్ నాయక్, రాజేందర్ నాయక్, దేవేందర్ నాయక్, ఫుల్ సింగ్ నాయక్, బాలు నాయక్, సోమన్న నాయక్, పటేల్ నాయక్ , దస్రు నాయక్, వెంకన్న నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *