దగాకోరు దయాకర్ ను నమ్మితే అధోగతే-పదిహేనేళ్లలో పాలకుర్తి కి చేసింది శూన్యం

-కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి

పెద్దవంగర:

దగాకోర్ దయాకర్ ను నమ్మితే పాలకుర్తి ప్రజలకు అధోగతి తప్పదని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి హనుమాండ్ల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని కోరిపల్లి, కాన్వాయి గూడెం, గంట్లకుంట , మోత్య తండా గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్- గడపగడపకు జాన్సమ్మ పేరిట కాంగ్రెస్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దయలేని దయాకర్ రావు మాటలు మరోసారి నమ్మి మోసపోతే గోసపడక తప్పదని, దయాకర్ రావు జిమ్మిక్కులు, తాయిలాలకు ఆశపడితే మరో ఐదేళ్లు గోసపడక తప్పదని ఆమె అన్నారు. నియోజకవర్గంలో సరైన విద్యా వసతులు వైద్య వసతులు కరువయ్యాయని, గడిచిన 15 ఏళ్లలో దయాకర్ రావు చేసింది శూన్యమని, 30 సంవత్సరాల క్రితం నుండి తాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, గిరిజన తండాల దుస్థితి చూస్తుంటే బాధ కలుగుతుందని ఆమె అన్నారు. దోచుకోవడానికి దాచుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని, ఆడపడుచుగా ఆదరించి ఒక్క అవకాశం ఇస్తే మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఐదేళ్లు సేవ చేస్తానని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం, ప్రతి ఇంటా సంక్షేమం చేకూరుతుందని, పేదల సంక్షేమం కోసమే విద్యార్థుల చదువుకు రూ. 5 లక్షలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, పంట ఉత్పత్తులకు రూ. 500 బోనస్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పింఛన్ రూ. 4 వేలకు పెంపు వంటి ప్రజా రంజక ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసేందుకై రూపొందించడం జరిగిందన్నారు.ప్రజలు తమ భవిష్యత్తును ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని,ఆడపడుచుగా ఆదరించి గెలిపిస్తే ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తూ పాలకుర్తి నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతానని ఆమె చెప్పారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని దయాకర్ రావు బెదిరింపులకు అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన పనిలేదని, అండగా ఉంటూ అందరినీ కాపాడుకుంటానని కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తున్నాడని,ఆ పప్పులు పాలకుర్తిలో ఉడకమన్నారు.
10 రోజులు కష్టపడి పని చేయండి.. ఐదేళ్లు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, నెమరు గొమ్ముల శైలరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *