పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి…

  • పాలకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు

పెద్దవంగర:
గత పదేళ్లుగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాలని పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు, పెద్దవంగర గ్రామాల్లో ఎర్రబెల్లి జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో ప్రజలు ఎర్రబెల్లికి డప్పు చప్పుల్లు, కోలాటాలు, టపాసులు, బతుకమ్మ లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు కలిసి రోడ్ షో నిర్వహించి, ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వాళ్ళకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా అని నిలదీశారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేనటువంటి, దేశానికే ఆదర్శంగా నిలిచిన ఎన్నో సంక్షేమ పథకాలకు కేరాఫ్ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నిలిచిందని కొనియాడారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పారు. వల్మిడి, పాలకుర్తి, బొమ్మర గ్రామాల ఉన్న ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా సుందరంగా తీర్చిదిద్దానని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు, మురుగునీటి కాలువలు, గ్రామాల మధ్య రోడ్లు, అంతర్గత రోడ్లు, నిర్మించడమే గాక, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, నాయకులు శ్రీరాం సుధీర్, ప్రముఖ ఎన్ఆర్ఐ పాకనాటి సునిల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ బానోత్ రవీందర్ నాయక్, మండల ఫోరం కన్వీనర్ ఏదునూరి శ్రీనివాస్, సర్పంచులు వెనుకదాసుల లక్ష్మీ, కేతిరెడ్డి దీపిక, రావుల శ్రీనివాస్ రెడ్డి, జలగం లక్ష్మీ, జలగం శేఖర్, పాకనాటి సోమారెడ్డి, పసులేటి వెంకట్రామయ్య, రెడ్డెబోయిన గంగాధర్ యాదవ్, విజయ్ పాల్ రెడ్డి, రాంమూర్తి, అనుదీప్, యాకన్న, శివరాత్రి సోమనర్సు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *