బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యం

  • సోమారపు ఉపేందర్
    ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
    పాలకుర్తి:
    బడుగు బలహీన వర్గాలైన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మత మైనారిటీ,అగ్రవర్గాల పేదలందరి కోసం అత్యున్నతమైన అడిషనల్ డిజిపి స్థాయి ఉద్యోగాన్ని త్యజించి బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న అలుపెరుగని శ్రామికుడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్ధి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 57వ జన్మదినం సందర్భంగా వారికి పాలకుర్తి నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ తరపున హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతున్నామని పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జీ సోమారపు ఉపేందర్ తెలిపారు. గురువారం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు ఫలహారాలు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు బీఎస్పీ నాయకులు. బహుజన రాజ్య స్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం నెరవేరాలని వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన కులాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు గుమ్మడిరాజుల సాంబయ్య, నియోజకవర్గం బీఎస్పీ ఉపాధ్యక్షులు పడమటింటి భాస్కర్, కోశాధికారి చిలుమల కృష్ణ, మైనారిటీ నాయకుడు మహ్మద్ అఫ్జల్, పాలకుర్తి మండల అధ్యక్షులు చెరిపెల్లి కుమార్, బండిపెల్లి యాదగిరి, వెల్పగొండ కుమార్, మల్లికార్జున్, గుండె పర్శిరాములు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *