ఎర్రబెల్లి ఎవర్ని బాగు చేసే..?-తాగి పడేసిన బీరు సీసాలు అమ్ముకోమన్న దౌర్భాగ్యం

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని మామిడాల యశస్విని రెడ్డి
    రాయపర్తి: గ్రామాల్లో ఎంతో కొంతో అభివృద్ధికి సర్పంచ్ లు పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలైతే తాగి పడేసిన బీరు సీసాలు అమ్ముకోమన్న దౌర్భాగ్య పరిస్థితి అని, నమ్ముకున్న కార్యకర్త ఎవర్ని ఎర్రబెల్లి దయాకర్ రావు బాగు చేశారని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్ గడప గడపకు ఝాన్సమ్మ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కొండాపురం, పెర్కవేడు, మహబూబ్ నగర్, రాగన్న గూడెం, గణేష్ కుంట తండా, మైలారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ఆమెకు ఘన స్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మల తో అధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆమె మాట్లాడారు. ఏళ్ల తరబడి ఎర్రబెల్లిని గెలిపిస్తే ఆయన చేసింది ఏమి లేదన్నారు. ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పించకుండా బెల్ట్ షాపులు విచ్చల విడిగా పెంచి తాగుడుకు బానిసల్ని చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారన్నారు. పేదల సొంత ఇంటి కళ ఎంత మందికి నెరవేరిందన్నారు. కాంగ్రెస్ ఇవ్వనున్న ఆరు గ్యారెంటి స్కీం లతో ప్రజలకు ఎంతో లబ్ది చేకూరతుందన్నారు. ఇంత కాలంలో పనులు చెయ్యని వాళ్లు ఇప్పుడు వచ్చి ఎదో చేస్తామని బుటకపు హామీలు ఇస్తే నమ్మి మోసపోవద్దన్నారు. వాళ్లు ఇచ్చే వేయి రెండు వేలకు ఓటేస్తే ఐదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు. మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలని కోరారు. ఎర్రబెల్లి కేసు లు పెట్టించే ప్రయత్నాలు చేస్తాడని దేనికి భయపడవద్దు నేనున్నా అన్నారు. తనను గెలిపిస్తే నా జీతాన్ని కూడా ప్రజల అభివృద్ధికే ఉపయోగిస్థానన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ ఆమ్యా నాయక్, నాయకులు కాకిరాల హరి ప్రసాద్, ముత్తినేని సోమేశ్వర్ రావు, సరికొండ కృష్ణా రెడ్డి, మాచర్ల ప్రభాకర్, రెంటల గోవర్ధన్ రెడ్డి,కుందూరు విక్రం రెడ్డి, చిన్నాల కిషన్, కౌడగాని ఉమా, బండి కుమార్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *