ఎచ్చెర్ల సామాజిక సాధికార యాత్రకు జన ప్రభంజనం

ప్రజలే జగన్ బలం… ఆయనే జనం ఆత్మబలం : డిప్యూటీ సీఎం రాజన్నదొర

టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికే సామాజిక సాధికార యాత్రకు జనం పోటెత్తుతున్నారు : స్పీకర్ తమ్మినేని

జగన్ కు భయంను లోకేశ్ పరిచయం చేస్తాడట.. నీ బాబు వల్లే కాలేదు..నువ్వేం చేయగలవు, ఢిల్లీ వెళ్లి దాక్కున్నావ్ : మంత్రి సీదిరి

విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటున్న బాబును ఎన్నికుల్లో మట్టి కరిపించాలి. బాబుకు అధికారం ఇచ్చి మన పీకలు మనమే కోసుకుంటామా : మంత్రి ధర్మాన

జగన్ ను మళ్లీ సీఎంను చేసుకుని సంక్షేమ పాలన కొనసాగించుకుందాం : ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్

ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) :
ఉత్తరాంధ్ర జిల్లాలో విజయవంతంగా సాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనం ప్రభంజనంలా పోటెత్తారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులకు అడుగుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం చిలకపాలెం జంక్షన్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, వైెఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు హాజరయ్యారు.

ప్రజలే జగన్ బలం.. ఆయనే అందరికీ ఆత్మబలం : డిప్యూటీ సీఎం రాజన్నదొర

ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ఎచ్చెర్ల సామాజిక సాధికార యాత్రకు వచ్చిన జనమే టీడీపీ హెచ్చరికలు జారీ చేస్తోందన్నారు. ప్రజలే జనగ్ బలం, ఆయనే అందరికీ ఆత్మబలం అని పిలుపునిచ్చారు. కులం, మతం., రాజకీయం, వర్గాలు లేకుండా అందరికీ మేలు చేయడానికే జగన్ నాలుగున్నరేళ్లగా పరితపిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఏ వర్గానికి గుర్తింపు లేకుండా పోయిందని, గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే, జగన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. 65 ఏళ్లకు చంద్రబాబు పెన్షన్ ఇస్తే, 60 ఏళ్లకే జగన్ పింఛన్ ఇస్తున్నారని, ఐదెకరాలు భూమి ఉంటే, ఉన్న బాబు పెన్షన్ తీసేసారని, జగన్ మాత్రం అటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైనవారందరికీ లబ్ధి చేకూర్చారని, అది జగన్ మానవత్వానికి నిదర్శనమన్నారు. చేయి చేయి కలిపి ఏకమై జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికే సామాజిక సాధికార యాత్రకు జనం పోటెత్తుతున్నారు : స్పీకర్ తమ్మినేని

స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, సామాజిక సాదికార బస్సు యాత్రకు భారీగా జనం పోటెత్తుతుండటం టీడీపీ హయాంలో జరిగిన అన్యాయానికి ప్రజలు తీర్చుకుంటున్న ప్రతీకారమని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలకు సమాన హక్కులు, అధికారులు, సంపద పంచి పెట్టాలని బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కన్నప్పటికీ ఇన్నాళ్లూ ఆచరణకు నోచుకేలేదని, జగన్ సీఎం అయిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పించి సామాజిక సాధికారతను సాధించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కొనియాడారు.

జగన్ కు భయంను లోకేశ్ పరిచయం చేస్తాడట… నీ బాబు వల్లే కాలేదు..నువ్వేం చేయగలవు, ఢిల్లీ వెళ్లి దాక్కున్నావ్ : మంత్రి సీదిరి

పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, మత్స్యకారులను సీఎం జగన్ అక్కున చేర్చుకుని రాజ్యాధికారం ఇచ్చారని, ఒ మత్స్యకారుడుని పార్లమెంట్ కు పంపిన ఘనత జగన్ దే నని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను తోకలు కత్తిరిస్తానని, జడ్జిలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసాడాని, ఫినిష్ చేస్తానంటూ అని, ఎస్సీ, ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఆ వర్గాలను వివిధ సందర్భాల్లో బెదిరించి అవమానాలకు గురి చేసారని, అలాంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి పిడికిలి బిగించి నడుంగట్టి నిగ్గదీసి నిలదీయాలని సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎవరి వద్ద చేయి చాపకూడదని జగన్ సంకల్పించి సం7ేమ పథకాలను నిరంతరాయంగా జగన్ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పుట్టిన పిల్లాడు దగ్గర నుంచి పండు ముసలి వరకు సంక్షేమాన్ని అందిస్తూ చేయూతనిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని వెల్లడించారు. ప్రజలంతా ఆలోచించి జగన్ ను సీఎంగా మరోసారి గెలిచేందుకు ఆశీర్వదించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గుజరాత్ చిక్కిపోతే ప్రత్యేకంగా బస్సులు వేసి స్వగ్రామానికి తీసుకువచ్చారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ చిక్కిపోయిన మత్స్యకారులను తిరిగి వారి వారి ప్రాంతాలకు తీసుకురావడానికి జగన్ ఎంత కృతనిశ్చయంతో పని చేసారో అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎనాడైనా ఒక్క పోర్టుకు గానీ, హార్బర్ కు గానీ ప్రారంభించారా అని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మత్స్యకారుల సంక్షేమానికి జిల్లాకో హార్బర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారన్నారు లోకేశ్ జగన్ కు భయాన్ని పరిచయం చేస్తాడట, నీ బాబు వల్లే కాలేదు, నీవేం చేయగలవు.. ఢిల్లీ వెళ్లి దాక్కున్నావని ఎద్దేవా చేసారు.

విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటున్న బాబును ఎన్నికుల్లో మట్టి కరిపించాలి. బాబుకు అధికారం ఇచ్చి మన పీకలు మనమే కోసుకుంటామా : మంత్రి ధర్మాన

రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదారవు మాట్లాడుతూ, చంద్రబాబు పరిపాలన ఎంత లోఫభూయిష్టంగా ఉన్నదో, జగన్ ను సీఎం చేస్తే ఎలాంటి పాలన చేస్తామో గతంలోనే చెప్పామని, ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత వైసీపీ అప్పుడు ఏం చెప్పింది.. ఇప్పుడు ఏం చేసిందో వివరించేందుకు బస్సు యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నన్నామన్నారు. రూ. 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి సీఎం జగన్ మంజూరు చేసారని, దీంతో ఇకపై గుజరాత్ వంటి రాష్ట్రాలాకు మత్స్యాకారులు ఉపాధి కోసం వలస వెళ్లిన పరిస్థితి ఉండదని, హార్బర్ కోసం ఎవరూ అడగకపోయినా జగన్ దూరదృష్టితో మంజూరు చేసారన్నారు. రాజ్యాంగ బద్దమైన పాలన ను జగన్ చేస్తున్నారని, ప్రభుత్వంలోనూ, పాలనలోనూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు పని చేస్తున్నారాని, అందుకే హార్బర్ , ఫిషి ల్యాండింగ్ సెంటర్ ను ఈ ప్రాంతానికి మంజూరు చేసారాన్నారు. సీఎం జగన్ తన పాలనలో కులాలు, మతాలు, వర్గాలను చూడటం లేదని, కానీ చంద్రబాబు మాత్రం వర్గాలు చూస్తూ జాతుల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. పేదలకు సాయం చేస్తుంటే చంద్రబాబు అన్యాయమని చెబుతూ, తనకు మరోసారి అధికారం కావాలని అడుగుతున్నాడని, మీ పీక కోసే వాడికి అవకాశం ఇచ్చి మన పీక మనమే కోసుకుంటామా అని ధర్మా ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తూ ఇచ్చిన మాటలకు కట్టుబడి చెప్పిన అన్ని హామీలను నెరవరేచ్చిన ప్రభుత్వాన్ని కొనసాగించుకుంటామా, లేక మాయ మాటలతో మోసం చేసే చంద్రబాబును తెచ్చుకుంటామా అన్నది ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజదానిని కాకుండా అడ్డుకుంటూ అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో మట్టి కరిపించాలని కోరారు.

జగన్ ను మళ్లీ సీఎంను చేసుకుని సంక్షేమ పాలన కొనసాగించుకుందాం – ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్

ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిస్తూ సంక్షేమ పాలనను జగన్ చేస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ సీఎంగా ఓడించాలని చూస్తున్నారని, ప్రజలంతా ఆలోచన చేసి ఈ దుర్మార్గుల దురాలోచనతో వస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రియతమ నేత జగన్ ను మళ్లీ సీఎం గా గెలిపించుకోవడం ద్వారా ఇప్పటి సంక్షేమ పాలనను కొనసాగించవచ్చునన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పరిపాలన చేసినా సరే ప్రజల జీవన స్థితిగతులు ఏమాత్రం మారలేదని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పాలన చేస్తూ సామాజిక స్థితిగతులు మార్చేసారని వివరించారు. రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *