యువతర రాజకీయాలతోనే సమాజ మార్పు అనివార్యం


26ఎళ్ల యువతి…66 ఎళ్ల వృద్దుడి మధ్య సమరం ఇదీ
– హనుమాండ్ల ఝాన్సీరెడ్డి
పాలకుర్తి ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ ః
యువతర రాజకీయాలతోనే సమాజ మార్పు అనివార్యంగా జరుగుతుందనీ పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంతోపాటు ధర్మాపురం పరిధి లకావత్‌ తండా, పడమటి తండా, సిత్య తండా,లక్ష్మణ్‌ తండా, ధర్మాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎమ్మేల్యే అభ్యర్థి యశస్వినిరెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారంతోపాటు గ్రామాలలో నిర్వహించిన ర్యాలీలో టపాసులు పేల్చి,డప్పుచప్పుల్ల తో,మహిళలు కోలాటాలతో,బతుకమ్మలతో ఎదురేగి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు దోచుకుని దాచుకోవడానికి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.నాణ్యతలేని డబల్‌ బెడ్‌ రూములు నిర్మించలేదని, కట్టిన ఇచ్చిన పాపానపోలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే మూసపద్దతిలో రాజకీయం నడిపిస్తూ ఓట్ల దండుకునే కుటిల రాజకీయాలకు స్వస్తి పలికిలే 26 ఎళ్ల యువతికి, 66 ఎళ్ల వృద్దుడి మధ్య జరుగుతున్న ఎన్నికల సమరంలో ఫ్రజలే హీరోలనీ అభివర్ణించారు. మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని..
ఇప్పుడున్న ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతోపాటు ప్రత్యేక కార్యాచరణతో యువత బాగుపడుతుందన్నారు. గిరిజన,దళిత వర్గాల అభ్యున్నతి ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగిందని, అదే స్పూర్తితో సోనియాగాంధీ స్వార్దం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ ద్వారా ఫ్రజాఆకాంక్షలను నేరవేర్చే క్రమంలో ప్రజారంజకమైన సంక్షేమ పథకాలతో పేదల బతుకులు బాగుపడుతాయన్నారు, ఈ క్రమంలోనే మేము రాజకీయాల్లోకి వచ్చిందే మీకు సేవ చేసేందుకేనని..బిఆర్‌ఎస్‌ నాయకులు మీకు డబ్బులు ఇచ్చినా తీసుకోండని..అధికార మార్పు కోసం కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో యశస్విని రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతీ కార్యకర్త గ్రామస్థాయి నుండి పార్టీ గెలుపే లక్ష్యంగా 48 గంటలు పనిచేసి విజయం సాధించిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్‌ లకావత్‌ లక్ష్మీనారాయణ నాయక్,మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్, సీనియర్‌ నాయకులు కాసారపు ధర్మారెడ్డి, రెడ్డిరాజుల రమేష్, తోటకూరి రమేష్,పాండుకృష్ణ, ఉప్పుల ఉçప్పలయ్య, ఈదునూరి రాజు, వెంకట్‌రెడ్డి, దౌపాటి రవి, పులిగిళ్ల వెంకన్న,యాకన్న,ఓడపల్లి రవీందర్, ఎస్టి సెల్‌ మండల అధ్యక్షులు భూక్య సజ్జన్‌ నాయక్, యూత్‌ మండల అధ్యక్షుడు యాకస్వామి, అనిల్, ఉప్పుల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *