పార్టీ కోసం కష్టపడ్డ రాయలకే టిక్కెట్ ఇవ్వాలినేలకొండపల్లి(పాలేరు ఎక్స్ ప్రెస్)పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ

ఎన్ని ఆటంకాలు ఎదురైనా పార్టీ కోసం కష్టపడిన టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు కు కాంగ్రెసు పార్టీ పాలేరు నియోజకవర్గ టిక్కెట్ ఇవ్వాలని బిసి సెల్ కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పనిచేసే వారికే టిక్కెట్ ఇవ్వాలన్నారు. ఎక్కడా ఫైరవీలకు తావివ్వ కుండా పార్టీ కోసం పని చేసే వారికే టికెట్లు ఇవ్వాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో పార్టీనిపట్టించుకునే నాయకుడు లేని సమయంలో నేనున్నా నంటూ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీని కాపాడిన నాయకుడు రాయల నాగేశ్వరరావు అన్నారు. సిఎల్పీ నేత భట్టి సహకారంతో నియోజకవర్గంలో తిరుగుతూ అధికార బిఆర్ఎస్ అరాచకాలను ఎండగట్టిన నేత రాయల అన్నారు. రాయల నాగేశ్వరరావు కు అధిష్టానం టిక్కెట్ ఖరారు చేస్తే గెలిపిచ్చి తీరతామన్నారు. పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు చేసిన రాయల నాగేశ్వరరావు కే కాంగ్రెస్ పార్టీ పాలేరు టిక్కెట్ ఇవ్వాలని కోరారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *