మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

పెద్దవంగర: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందనీ బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు.
శనివారం మండలంలోని చిట్యాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కులస్తులకు ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను ఎల్కా చెరువు, తూర్పు చెరువులలో 1లక్ష 62వేల బొచ్చా,రవ్వ, పులస వంటి పలు రకాల చేప పిల్లలను ముదిరాజ్ కులస్తులతో కలిసి ఆయన వదిలారు.
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ఉచితంగా చేప పిల్లలను పంపిణి ఉచితంగా అందజేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముదిరాజ్ ల సంక్షేమo, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని,అంతేకాకుండా మండలంలోని అన్ని గ్రామాలలో ముదిరాజ్ ల సంక్షేమనికి గుడి నిర్మాణ పనులు మరియు కమ్యూనిటీ హల్ లు మంజూరు చేసిన ఘనత మంత్రి గారికే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో గౌరవ మంత్రి దయాకర్ రావు గెలుపు కోసం ప్రతి ఒక్కరు సమన్వయంతో సమిష్టిగా పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి R. రాజు, మాజీ వార్డు సభ్యులు రాపోలు సుదర్శన్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులుగుజ్జా శ్రీధర్, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు పిట్టల వెంకన్న, సంఘం నాయకులు పిట్టల రాములు,గుంటుక శ్రీనివాస్, గుంటుక యాకయ్య, గుంటుక వెంకన్న,గుంటుక అంజయ్య, నారబోయిన స్వరాజ్యం, పాక నరేష్, పాక నాగయ్య, పాక జగదీష్,పాక సంపత్, BRS నాయకులు తోట చందర్,గొడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *