చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

  • జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సరిత
    తొర్రూరు:
    ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత అన్నారు.

న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

జడ్జి మాట్లాడుతూ….
చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచు కోవాలని పేర్కొన్నారు.
అపరిచిత వ్యక్తులు, పరిచయస్తులు, సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే నిర్భయంగా డయల్‌ 100కు ఫోన్‌ చేసి సహాయం పొందాల న్నారు.
మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులను నివారించాలని తెలిపారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమన్నారు.
18 ఏళ్ల లోపు బాల బాలికలకు చట్టం రక్షణ కల్పిస్తుందన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. చదువుకునే వయసులో సోషల్ మీడియా, సెల్ ఫోనుకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, స్టేటస్ లో పెట్టుకోవద్దని, వాటిని సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేసే అవకాశం ఉంటుందన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ నాగవాణి, ఎస్సై జగదీష్ , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్, న్యాయవాదులు లింగాల శ్రీనివాస్, గణపురం రామకృష్ణ, కృపావతి, విజయ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *