సమ్మక్క–సారలమ్మలా…అత్త–కోడళ్లు వచ్చాం–

పాలకుర్తి ప్రజలకు సేవచేసేందుకు అంకితం అవుతాం–నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి–పౌరసత్వం అడ్డంకి చర్యలతో ప్రత్యర్థుల ఓటమి అంగీకారం–జననీరాజనంతో రహదారిన కదిలిన కాంగ్రెస్‌ ర్యాలీ–అడగుడుగున కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డికి ఘనస్వాగతం–బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నిజాం పాలన పునరావృతం ః మాజీ ఎంపీ సిరిసిల్ల–కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని,ఝాన్సీరెడ్డిల స్పష్టీకరణ

పాలకుర్తి ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ ః
సమ్మక్క సారలమ్మ ఉద్యమ స్పూర్తికి తీసిపోని పాలకుర్తి ప్రాంతంలో అత్త కోడళ్లమైనా మేమిమిద్దం విదేశాల్లో స్థిరపడినా స్వదేశంలో సేవ చేసేందుకు వచ్చామని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యశస్విని, పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీరెడ్డిలు స్పష్టం చేశారు.
సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్టు పొందిన మామిడాల యశస్వినిరెడ్డి తొలిసారి నియోజకవర్గంలో అడుగిడిన సందర్బంగా వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి దేవరుప్పుల, కొడకండ్ల మండలాల మీదుగా జనగామ–సూర్యాపేట రహదారిలో భారీ ర్యాలీతో పాలకుర్తి చేరుకున్నారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యశస్వినిరాంమోహన్‌రెడ్డి, ఝాన్సీ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బృందావన్‌ గార్డెన్‌లో పార్టీ శ్రేణులు గజమాలతో çసత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబం ఉన్నతవిద్యకోసం వెళ్లి అమెరికాలో స్థిరపడినప్పటికి జన్మనిచ్చిన ప్రాంతం పట్ల ప్రేమానురాగాలతోనే అభివృద్ది సేవా కార్యక్రమాలు చేపట్టే క్రమంలో మరింత ప్రజలతో మమేకం కావడానికి ఎన్నికల రంగానికి దిగామన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్‌ గెలుపు ధ్యేయంగా అధినేతలు సోనియా, రాహుల్, ఖర్గే, రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో ముప్పయి రోజుల్లో మీ సంపూర్ణ సహకారాలతో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయడానికి సర్వం సిద్దమయ్యామని అన్నారు. నిరాదరణకు గురయ్యే చిన్నపిల్లల నుంచి వృద్ధులకు ప్రత్యేక ఆశ్రమం కల్పిస్తామన్నారు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ దయాకర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ ధైర్యం, గుండె చప్పుడుతోనే ఎన్నికల రంగంలో వెనుకడుగు వేయకుండా మీకోసం తగ్గేదీలేదన్నారు.
తెలంగాణలో పుట్టిన పాలకుర్తి ప్రాంత మెట్టింటి ఆఢపడుచునేననీ, తాము విదేశాల్లో ఉన్నప్పటీకీ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామనీ, ఆ స్పూర్తితోనే విద్య, వైద్య, ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేందుకు కాంగ్రెస్‌ కల్పించిన సదవకాశాన్ని ఇక్కడి ప్రజలు దోహదపడేలా చేస్తామన్నారు.ఈ క్రమంలోనే అమెరికా నుంచి అడుగిడినా నాటి నుంచి తనకు కాంగ్రెస్‌ టికెటు రాకుండా పౌరసత్వంకు ప్రత్యర్థ దుష్టశక్తులు పలు కేసులు పెట్టి చిక్కులు కల్పించారని, ఇలాంటి తరుణంలోనే ఎఐసిసి, టీపీసీసీ నేతలు మంత్రి దయాకర్‌రావు కుట్రలు చేదించేందుకు పాలకుర్తి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా, పార్టీ శ్రేణుల ఉత్సహానికి ఆటంకం కలుగకుండా నా బిడ్డలాంటి కోడల్ని ఎన్నికల రంగంలోకి దింపేందుకు అవకాశం కల్పించారని పేర్కోన్నారు. బీఆర్‌ఏస్‌ అభ్యర్థి ఓటమి భయంతో ముందస్తుగానే తమ పార్టీ నేతల్ని ప్రలోభాలకు గురిచేయడం, అక్రమ కేసులు పెట్టించడం, ఆఖరికి తమపై విçస్తృత దుష్పప్రచారాలు చేపట్టారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడకుండా సమ్మక్క,సారలమ్మల ప్రజాసేవకు అంకితమవుతున్నామనీ పునరుద్ఘాటించారు. తనకు పౌరసత్వం రాకుంటే విమానం ఎక్కడం ఖాయమన్న వారికి … ఇంకోక విమానంలో నా కోడలు దిగింది తస్మాత్‌ జాగ్రత్త అన్నారు. ..ఇప్పుడు మేమిద్దరం కాంగ్రెస్‌ పార్టీ రూపంలో ఇక్కడి ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడేలా చేసి కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పుట్టుకతోనే రాజకీయం ఎవరికి రాదనీ, యువతకు అవకాశం ఇస్తే నూతన ఓరవడితో పరిపాలన ఏలా ఉంటుందో నిరూపిస్తామనారు.వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ కేంధ్రంలో బీజపి దుర్మర్గ దుష్టపాలనతో రాజ్యాంగాన్ని రద్దు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మనువాద రాజ్యం తేచ్చేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణసాధన కర్తగా అధికారంలోకి వచ్చిన సీఎం కెసీఆర్‌ నోట నిజం పలికితే శాపగ్రస్తుడైనందునే నిత్యం పచ్చిఅబద్దాలతో పరిపాలన చేస్తున్నాడని, తెలంగాణ అమరవీరుల ఆశయాలకు విఘాతం కల్పిస్తూ నీళ్ల పేరిట కాళేశ్వరాన్ని నట్టెట ముంచిండు. ఉద్యోగాలు ఇవ్వకుండా క్రమబద్దీకరణ కుట్రలు.అభివృద్ది పేరిట యాదగిరి గుడి, సెక్రటరీ నిర్మాణాల కూల్చి తన మార్కు కోసం దోపిడికి పాల్పడుతున్నాడని విమర్శించారు. దోపిడి డబ్బుతో ఓటర్లకు నోట్లు పంచి ఓట్లను కోనుగోలు చేయడమే లక్ష్యంగా ఎన్నికలకు దిగుతున్నాడని అన్నారు.. దేశ సమైక్యత కోసం భారత్‌ జోడో యాత్ర చేసిన రాహూల్‌ గాంధీ సంకల్ప విజయం కోసం బీజెపి, బీఆర్‌ఏస్‌లు ఇచ్చే డబ్బును ఎడమ చేతితో తీసుకొని కుడిచేత్తో ప్రజలకు అభహస్యం ఇచ్చే ఆరు గ్యారంటీల అమలు కోసం హస్తం గుర్తుకే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లీ సోనియా గాంధీ అని అభివర్ణించారు. కార్యక్రమంలో పిసిసి మాజీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ మహిళ అధ్యక్షురాలు వడ్లకొండ తార ్రçపశాంత్, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనుముల మల్లారెడ్డి, జలగం కుమార్, నెమరుగొమ్ముల వెంగల్‌రావు,ఓయు జెఎసీ వ్యవస్థాకసభ్యులు ఇప్ప పృధ్వీరెడ్డి, పాలకుర్తి,దేవరుప్పుల కొడకండ్ల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి , పెద్ది కృష్ణమూర్తి, దారావత్‌ సురేష్‌ నాయక్,యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అ«ధ్యక్షుడు రాజేష్‌ నాయక్, పలు విభాగాల పార్టీ నాయకులు హరీష్, భార్గవ్, శ్రీశైలం, డాక్టర్‌ జీ వై సోమయ్య, దామెర అనిల్, గణేష్, రసూల్, సజ్జన్,యాకస్వామి, అనిల్, భాస్కరచారీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *