ప్రజల ఆకాంక్ష మేరకు రాజకీయ రంగప్రవేశం

– నేటి తొర్రూరు ప్రియాంక సభను జయప్రదం చేయండి
– హనుమాండ్ల ఝాన్సీరాజేందర్‌రెడ్డి పిలుపు
తొర్రూరు ః పాలకుర్తి ప్రజల ఆకాంక్ష మేరకు స్వపరిపాలన కోరుకునే దిశలో తమ కుటుంబ ఇష్టానుసారమే యశస్వినిరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారనీ ప్రముఖ కార్డియాలజిస్ట్‌ హనుమాండ్ల రాజేందర్‌ రెడ్డి, ఝాన్సీరెడ్డిలు స్పష్టం చేశారు. గురువారం తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడినప్పటికి పుట్టిన ఊరు, పెరిగిన ప్రాంతాలతో సత్స్‌బందాలు మరువలేదన్నారు. పాలకుర్తి ప్రాంతంతోపాటు పలు జిల్లాలో తాము సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. సంపాదించే ధ్యేయంగా రాజMీ యాలను వాడుకోవాల్సిన అవసరం తమకు లేదనీ, ప్రజలకు మరింత చేరువలో సేవ చే సేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఝాన్సీరెడ్డికి సదవకాశం ఇస్తే కొందరు పౌరసత్వం పేరిట చిక్కులు కల్పించింది విదితమే అన్నారు. ఐనప్పటీకీ మా సంకల్పాన్ని నేరవేర్చుకోవడానికి యువతరానికి పార్టీ కల్పించిన మరో అవకాశం మేరకు విద్యావంతురాలైన యశస్వినిరెడ్డిని రంగంలో దింపితే రాజకీయంగా ఎధుర్కోలేక కల్పిత అర్దరహిత విమర్శలతో ఉనికి చాటుకునేందుకు యత్నించడం విచారకరమన్నారు. ప్రజాసేవకు కంకణబద్దులైన తమకు కాంగ్రెస్‌ అధిష్టానం టికెటు ఖరారు చేయడం పట్ల కృతజ్ఢతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీరెడ్డి, ఎమ్మేల్యే అభ్యర్థి యశస్వీనిరెడ్డి మాట్లాడుతూ గతంలో పార్టీ కోసం శ్రమించిన నాయకులతో కలిసి పాలకుర్తిలో ప్రజాస్వామ్యయుత రాజకీయాలకు పునాదులు వేయడం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పూర్వవైభవం కోసం నేడు తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్‌ సమీపంలోని చాకలి ఐలమ్మ సభాప్రాంగణంలో తలపెట్టిన విజయభేరీ సభకు ప్రియాంకగాంధీ రానున్నందును నియోజకవర్గ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీపీ సిరిసిల్ల రాజయ్య, తొర్రూరు పిఎసిఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరి ప్రసాద్, తొర్రూరు మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *