ఉద్యమాల గడ్డను మరింత అభివృద్ది చేస్తా

–పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేవరుప్పుల ః ఉద్యమాల గడ్డను మరింత అభివృద్ది ఫథంలోకి తీసుకెళ్తాననీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి , ఎమ్మేల్యే బీఆర్‌ఏస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని కడవెండి, ధర్మాపురంలో ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లికి గులాబీ శ్రేణులు సాంస్కృతిక సంప్రదాయాల ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. యాభై సంవత్సరాలు పాలన చేసిన కాంగ్రెస్‌ హాయంలో జరిగిన అభివృద్దితో బీఆర్‌ఏస్‌ ప్రభుత్వం చేసిన శాశ్వత ప్రాతిపదికన పనులు, రైతు సంక్షేమ పథకాలను బేరీజు వేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చెరువుల పునరుద్దరణ,చెక్‌డ్యామ్‌లు , కాల్వల ద్వారా సాగునీరు, రైతు బంధుతో విస్తీర్ణం పెరిగడంతో అన్నదాతలు ఆర్దికంగా అభివృద్ది చెందుతున్నారన్నారు. ో స్వపరిపాలన కోసం తండాలను పంచాయతీలు చేసిన ఘనత బీఆర్‌ఏస్‌కు దక్కుతుందన్నారు. రేలారేలా గంగవ్వ, కనకవ్వ జానపద గేయాలతో ప్రభుత్వ పథకాలపై వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు బస్వ సావిత్రిమల్లేష్, పల్ల భార్గవిసుందర్‌రామి రెడ్డి, బెత్లీనా లీనారెడ్డి, దుబ్బాక కవితరత్నాకర్‌రెడ్డి, మదార్, తాటిపెల్లి మహేష్, హన్మంతు ,అశోక్, ఉపేందర్, కృష్ణమూర్తి, రమేష్, , సాయిలు,సతీష్, లాలునాయక్, యాకయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *