కుట్రపూరిత రాజకీయాలతోనే ఎర్రబెల్లికి చెల్లుబాటు

– తాగిన సీసాలు అమ్ముకోమన్న పంచాయతీ మంత్రి
–రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
–రాష్ట్ర సాధన కోసం పాటుపడిన యువతకు తీరని మోసం
–పాలకుర్తి ఎమ్మేల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి
రాయపర్తి: కుట్రపూరిత రాజకీయాలతోనే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఇన్నాళ్లు చెల్లుబాటు అయిందనీ పాలకుర్తి ఎమ్మేల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి విమర్శించారు. శనివారం మండలంలోని కిష్టాపురం, కాట్రపల్లి, మొరిపిరాల, శివరామ పురం గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. . ఈ సందర్బంగా ఆమెకు ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు.ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యర్థులు లేకుండా ప్రతిపక్షాలు లేకుండా చేసి ఎదురులేని దయన్న అనిపించుకోవడం రాజకీయస్పూర్తి కాదన్నారు. పల్లెప్రకృతి పనులకు నిధులు లేకున్నా మంత్రిని నమ్మి పనులు చేపట్టిన సర్పంచ్‌లకు ఖాళీ సీసాలు అమ్ముకొని సొమ్ము చేసుకోమ్మని పరువు తీసిన మంత్రికి ఇక బాయ్‌ చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ కాంగ్రెస్‌ హాయాంలో ఏమీ అభివృద్ది జరుగనట్టు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన మాట మేరకు సోనియా గాం«ధీ తెలంగాణ ఇచ్చిన అమలు కట్టుబడి ఉండే కాంగ్రెస్‌ పార్టీకి నిదర్శనం అన్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు ఏదైనా ప్రభుత్వ పథకం ఉంటే వాళ్ల పార్టీ వాళ్లకు ఇస్తారేమో కానీ కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళం మాత్రం ప్రజలందరికి ఇచ్చేలా చూస్తాం అన్నారు. గ్రామాల్లో అభివృద్ది పేరిట తమ నాయకుల జేబులు నింపారే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే తెలంగాణ ధ్రోహులను చేర్చుకొని అమరుల ఆశయాలకు విఘాతం కల్పించేలా కెసీఆర్‌ కుటుంబపాలన కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడిన నిరుద్యోగులకు ఉద్యోగ నియమాకాలు చేపట్టకుండా పరీక్షల రద్దు, లీకేజీల వ్యవహారంతో కాలయాపన చేస్తూ వారి జీవితాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెలగాటమాyì ందన్నారు. సోనియాగాం«ధీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల బతుక భరోసా కోసం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలతోపాటు ప్రజాస్వామ్యయుత పరిపాలన అందాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం అనివార్యమనీ, పొరపాటున బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నిజాం కాలంనాటి అణిచివేత, పెత్తందారి వ్యవస్థను చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాల్లోకి వెళ్లినా తాము సంపాదన «ధ్యేయంగా ఇక్కడికి రాలేదనీ, ప్రజా సేవ చేసేందుకే తాము వచ్చామన్నారు. అక్రమంగా సంపాదించిన రేషన్‌డీలర్‌ డాలర్‌ ఎర్రబెల్లిగా మారిన దయాకర్‌రావుకు ఓటమి తథ్యం అన్నారు. తనను గెలిపిస్తే ప్రత్యేక కార్యాచరణతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ది ఫథంలోకి తీసుకపోయే క్రమంలో తనకు వచ్చే జీతాన్ని సైతం ప్రజలకే అంకితం చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జాటోత్‌ ఆమ్యా నాయక్, నాయకులు సరికొండ కష్ణారెడ్డి, కుందూరు గోపాల్‌ రెడ్డి, కుందూరు విక్రం రెడ్డి, జినుగు రత్నాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *