పాలకుర్తి ప్రజలను మోసం చేస్తున్న పాలక పార్టీలు

  • పాలకుర్తి నియోజక వర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
  • పాలకుర్తి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్ జేరిపోతుల
    పాలకుర్తి;
    పాలకుర్తి నియోజక వర్గంలో స్థానిక ప్రజలను పాలక పార్టీలు మోసం చేస్తున్నాయని, నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లాలోని పాలకుర్తి నియోజక వర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్ జేరిపోతుల అన్నారు. శనివారం దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్ జేరిపోతుల మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. స్థానిక సమస్యల గురించి పట్టించు కోకుండా కమీషన్లు వచ్చే పనులను చేశారు తప్ప మాలిక వసతుల ఏర్పాటు గురించి ఏమాత్రం పట్టించుకోలేద న్నారు. విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులో లేదన్నారు. పాలకుర్తి కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు నెలకొల్పలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారన్నారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను గుర్తించి పేద ప్రజలకు పంపిణీ చేస్తానని తెలిపారు. స్థానిక నియోజక వర్గానికి జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రభుత్వ నిధులు వచ్చినప్పటికి అభివృద్ధి చేయడంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించడ న్నారు. తనకు కమిషన్లు వచ్చే పనులను చేసి మొత్తం అభివృద్ధి చేశానని గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడ న్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్థానికుడిగా, ఉన్నత విద్యావంతుడినైన తనపై నమ్మకముతో ఓటు గెలిపించా లని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో గోలా గంగారావు,,శ్రావణ్ కుమార్, సోమయ్య, యాకన్న, ప్రణయ్, మంజుల, శోభ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *