బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మార్పుజరుగకుంటే నియంతృత్వ పాలన

– కాంగ్రెస్‌ హాయాంలోనే గిరిజనులకు పెద్దపీట
– ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ అభయహస్తం
– వానకొండయ్యగుట్ట క్వారీ పనులు రద్దు చేపిస్తా
–యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన కృషి
–కోడలు గెలుపు కోసం రంగంలోకి రాజేందర్‌రెడ్డి
–పాలకుర్తి ఎమ్మేల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిఝాన్సీరెడ్డి
పాలకుర్తి ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌నెట్‌ వర్క్‌ ః
తెలంగాణ సాధన ఉద్యమంతో అధికారం చేజిక్కుంచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పాలకుర్తి ప్రజలు మార్చకుంటే నియంతృత్వ పాలనలో మగ్గాల్సి వస్తుందని పాలకుర్తి ఎమ్మేల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి అన్నారు.ఆదివారం దేవరుప్పుల మండలంలోని పెద్ద తండా, మాధాపురం, తూర్పుతండా,దేవునిగుట్ట తండా,పొట్టిగుట్ట తండా, దుబ్బ తండాలలో ఆమెతోపాటు ,టీసీపీసీ సభ్యులు డాక్టర్‌ లాకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌లకు ఊరూరా గిరిజన సాంప్రదాయసంస్కృతిలో ఘనస్వాగతం పలికారు. 1200 మంది ఆత్మబలిదానాలతో సిద్దించిన ప్రత్యేక రాష్రంలో కల్వకుంట్ల కుటుంబంలో నలుగురికి మంత్రి పదవులు ఉద్యోగాలు తప్ప అమరత్వం పొందిన కుటుంబాల గోస పట్టించుకున్న పాపానపోలేదన్నారు. 35 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ నియమాకాలు చేపట్టకుండా పరీక్షల రద్దు, లీకేజీలతో వారిలో నిరాశ కలిగించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఉద్యమ కారులకు సముచిత న్యాయంతోపాటు ఎడాదిలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తి చేస్తారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోఎ విద్య,వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణతో నిరుద్యోగుల్లో వెలుగులు నింపుతామన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పథకాలు షాంపిల్స్‌కు పరిమితం అయ్యాయని విమర్శించారు. , గిరిజనుల్లో చైతన్యం పెరిగి ఇంటింటా ఉన్నత విద్యావంతులు ఎదిగినా వారి భవిష్యత్తు కోసం చేసింది ఏమిలేదన్నారు. ఆరేళ్ల నుంచి పేదలకు రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ హాయాంలో ఇందిరమ్మ తరహాలో గిరిజనులకు పెద్దపీట వేసినమాదిరి ఆరు గ్యారంటీల పథకాలు తెలంగాణకు అభయహస్తంగా నిలుస్తాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉన్న ఉచిత 24 గంటల కరెంటు, రైతు బం«ధు పథకాలు రద్దు చేస్తారని బదనం సరికాదన్నారు. ఉద్యమాల గడ్డ కడవెండిలోని చరిత్ర కలిగిన వానకొండయ్య గుట్టను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 25 ఏళ్ల క్వారీ అనుమతులు ఇస్తే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు మంత్రి దయాకర్‌రావు రద్దు చేసినఅనడం అబద్దమనీ, తనను ఎమ్మేల్యేగా గెలిపిస్తే సత్వరమే క్వారీ పనులు రద్దు చేపించి గుట్టను కాపాడుతాననీ హామి ఇచ్చారు. టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్‌ డాక్టర్‌ సెల్‌ జనగామ జిల్లా చైర్మన్‌ లకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే ఎస్టీలకు ఆనాడు రిజర్వేషన్‌ చేయడం వల్ల ఆత్మగౌరవంతోపాటు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. ఇంటింటా చదివిన లంబాడీ బిడ్డలకు ఉద్యోగం రావాలన్నా కాంగ్రెస్‌ గెలుపు అనివార్యమన్నారు. ఎక్కడ చూసీనా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తున్నాయే తప్ప తండాల్లో డబల్‌బెడ్‌రూమ్‌లు అందిన ధాఖలాలు లేవన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాలకతీతంగా ఇల్లు, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఖాయమన్నారు. దేవునిగుట్ట ఎన్నికల ప్రచారంలో డాక్టర్‌ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి పాల్గొని ప్రచార శైలని పరీశీలించడమేగాక కోడలు యశస్వినిరెడ్డి గెలుపు కోసం అభ్యర్థించారు. కార్యక్రమంలో ప్రముఖ వైధ్యులు హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ,జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసారపు ధర్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి,ఎర్రబెల్లి రాఘవరావు, మాజీ వైస్‌ఎంపీపీ శ్రీనిసాచారీ,ఓయుజెఎసీ నాయకులు ఇప్ప పృధ్వీరెడ్డి, అనుబంధ కమీటీల అధ్యక్షులు బోనగిరి యాకస్వామి, సజ్జన్‌నాయక్, ,ఇనుముల నాగరాజు, కౌడగాని రామచందర్‌జీ, సుధాకర్, నర్సింహ్మ, శ్రీధర్,తోటకూరి పాండు కృష్ణ, రమేశ్, శ్రీనివాస్,పులిగిల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *